అతివేగంగా బైక్ నడిపి డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బోరబండకు చెందిన ఆకాన్ష్, రఘుబాబు అర్ధరాత్రి సమయంలో బోరబండ నుంచి మాదాపూర్ వెళ్తుండగా.. మాదాపూర్ 100 ఫీట్ రోడ్‌లోని పర్వత్ నగర్ చౌరస్తా సమీపంలో బుల్లెట్ బైక్ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఘటనా స్థలిలోనే ఒకరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు మృతి చందారు. బైక్ నడిపిన యువకుడు మద్యం మత్తులో ఉన్నాడని, అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
Two youngsters died, when they lost control over the #Speeding bike and hit the divider in #Madhapur limits, caught on #CCTV .
It can be seen that they were not followed the #RoadSafety rules, didn't wear helmets.
The victims, Akansha (24) and her… pic.twitter.com/A4AsTVuiIX
— Surya Reddy (@jsuryareddy) December 27, 2024