బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ పై కేసు నమోదైంది. ఈ కేసులో పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
కాగా, ఎర్రోళ్ల శ్రీనివాస్ అరెస్ట్ ను బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండించారు. శ్రీనివాస్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. ఇది దుర్మార్గమైన చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రేవంత్ సర్కార్ పై ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో దళిత, బహుజన వర్గాలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ తరపున ప్రశ్నిస్తున్నందుకే ఎర్రోళ్లపై కక్ష కట్టి వేధించాలని చూస్తున్నారని రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్.