సంధ్య థియేటర్ ఘటనపై నిర్మాత దిల్ రాజ్ స్పందించాడు. శ్రీతేజ్‌ను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రేవతి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామన్నాడు. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానన్నాడు. అల్లు అర్జున్‌ను కూడా కలుస్తానని చెప్పాడు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఇలాంటి ఘటన జరగడం నిజంగా దురదృష్టకరమని దిల్ రాజు అన్నాడు. శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మన ముందుకు వస్తాడని ఆశిస్తున్నట్లు తెలిపాడు. అలాగే బాధితురాలు రేవతి భర్త భాస్కర్ కు ఇండస్ట్రీలో ఎదైనా ఉద్యోగం ఇప్పిస్తామన్నాడు. fdc ఛైర్మన్ గా ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీకి మధ్య సమస్యలు తలెత్తకుండా చూసుకుంటానని చెప్పాడు. ఇక ప్రభుత్వం తరఫున సినీ ఇండస్ట్రీకి అండగా ఉంటామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని గుర్తు చేశాడు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిశామని, ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పాడు. ఇలాంటి ఘటనలు ఎవరూ ఉద్దేశపూర్వకంగా చేయరని అన్నాడు. రెండు రోజుల్లోమరోసారి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని చెప్పాడు.