AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జ‌మ్మూక‌శ్మీర్‌లో ఘోర ప్ర‌మాదం.. ఐదుగురు జ‌వాన్లు మృతి

జ‌మ్మూక‌శ్మీర్‌లోని పూంఛ్ జిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. జ‌వాన్ల‌తో వెళ్తున్న వాహ‌నం అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోయింది. దీంతో ఐదుగురు జ‌వాన్లు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఎనిమిది మంది జ‌వాన్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌టనాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జ‌వాన్ల మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. గాయ‌ప‌డ్డ జ‌వాన్ల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. 300 అడుగుల లోతున్న‌ లోయ‌లో జ‌వాన్ల వాహ‌నం ప‌డిపోయింది.

ANN TOP 10