మేడిగడ్డ బ్యారేజీ ఇష్యూపై బీఆర్ఎస్ నేత కేసీఆర్, హరీష్ రావు హైకోర్టులో క్వాష్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందనే అంశంపై భూపాలపల్లిలో కేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా దీనిపై విచారణ జరపాలని భూపాలపల్లి కోర్టులో ఓ ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. దీంతో విచారణ జరిపిన న్యాయస్థానం కేసీఆర్, హరీష్ రావుకు జూలైలో నోటీసులు పంపింది. అయితే తాజాగా ఆ నోటీసులు కొట్టివేయాలని వారిద్దరూ హైకోర్టులో క్వాష్ పిటిషన్లు వేశారు.
ప్రజా ధనం వృథా అయిందంటూ..
ఇక మేడిగడ్డ ప్రాజెక్టు నిర్మాణంలో సరైనా రూల్స్ పాటించకుండా నిర్మాణాలు చేపట్టారని రాజలింగమూర్తి అనే వ్యక్తి భూపాలపల్లి జిల్లా కోర్టులో గతంలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. కాగా దీనివల్ల ప్రజాధనం భారీగా వృథా అయిందంటూ ఫిటిషనర్ పేర్కొన్నాడు. అయితే దీనిపై విచారణ చేపట్టిన జిల్లా న్యాయస్థానం జులై 10న కేసీఆర్, హరీశ్‌రావు సహా మరో ఆరుగురికి నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే ఈ నోటీసులను సవాల్ చేస్తూ హైకోర్టులో కేసీఆర్, హరీశ్‌రావు సోమవారం పిటిషన్లు దాఖలు చేశారు. అయితే వీరి పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టనుంది న్యాయస్థాం.