AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అంగరంగ వైభవంగా పీవీ సింధు వివాహం.. ఫొటో వైరల్

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్‌కు చెందిన 29 ఏళ్ల వెంకట దత్త సాయి (Venkata Datta Sai)తో సింధు వివాహం ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు, పలువురు ప్రముఖులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఇవి చూసిన అభిమానులు సింధు జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 24న (రేపు) హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెస్షన్‌ ఏర్పాటు చేశారు.

కాగా, సింధు పెళ్లి చేసుకున్న వెంకట దత్త సాయి.. పోసిడెక్స్‌ టెక్నాలజీస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ విషయాన్ని ఆమె తండ్రి పీవీ రమణ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక ఈనెల 14న వీరిద్దరి ఎంగేజ్మెంట్‌ కూడా ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పీవీ సింధు, వెంకట దత్తసాయి రింగ్స్‌ మార్చుకున్నారు. ఎంగేజ్‌మెంట్‌ ఫొటోను సింధు ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులతో షేర్‌ చేస్తూ… ‘ఒకరి ప్రేమనకు దక్కిన సమయంలో.. తిరిగి మనం ప్రేమించాలి’ అని క్యాప్షన్‌ ఇచ్చింది.

ANN TOP 10