AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్రికెటర్ రైనా అత్త, మామల దారుణ హత్య

నిందితుడిని కాల్చి చంపిన పోలీసులు
లక్నో: మాజీ క్రికెటర్ సురేష్ రైనా అత్త మామ, బావమరిదిని చంపిన నిందితుడు పోలీసులు ఎదురుకాల్పుల్లో హతమైన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ముజఫర్‌నగర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. పఠాన్‌కోట్‌లో 2020లో రషీద్ అనే వ్యక్తి తన గ్యాంగ్‌తో కలిసి సురేష్ రైనా అత్తగారింట్లో దొంగతనానికి పాల్పడ్డాడు. రషీద్ ను అడ్డుకుంటుండగా రైనా అత్త ఆశా, మామ అశోక్ కుమార్, బావమరిది కౌశల్‌ను కత్తితో అతడు దాడి చేశాడు. అశోక్ ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా ఆశా, కౌశల్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.

ఇద్దరు నిందితులను విచారించగా రషీద్ పేరు బయటకు రావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. షాపూర్‌లో కొందరు నిందితులు తలదాచుకున్నట్టు సమాచారం రావడంతో పోలీసులు, ఎస్‌ఒజి బృందం అక్కడికి చేరుకొని నిందితులను లొంగిపోవాలని సూచించింది. నిందితులు కాల్పులకు తెగపడడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో రషీద్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నిందితుడు చనిపోయాడని పరీక్షించిన వైద్యులు తెలిపారు.

ANN TOP 10