AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ భవన్‌కు To-Let బోర్డు!.. కాంగ్రెస్‌ సంచలన ట్వీట్‌

తెలంగాణ కాంగ్రెస్‌ తన అధికారిక సోషల్‌ మీడియా ఖాతాలో చేసిన పోస్ట్‌ సంచలనంగా మారింది. బీఆర్‌ఎస్‌ పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు టూలెట్‌ బోర్డ్‌  పెట్టిన పోస్ట్‌ చర్చనీయాంశమైంది.

అమెరికాకు వెళ్లిపోయిన తాత.. లిక్కర్‌ స్కామ్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చిన చెల్లి.. ఫార్ములా ఈ రేసు కేసులో జైలుకు వెళ్లనున్న అన్న అంటూ కేసీఆర్, కవిత, కేటీఆర్‌ పై ఆ పోస్టులో సెటైర్లు వేసింది కాంగ్రెస్‌ పార్టీ. తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఇక లేదని.. ఎంపీ ఎన్నికల్లో సున్నా సీట్లు రావడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్‌ పార్టీ కొన్ని రోజులుగా విమర్శలు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ ట్వీట్‌ పై బీఆర్‌ఎస్‌ నేతలు ఎలా కౌంటర్‌ ఇస్తారనే అంశం ఆసక్తికరంగా మారింది.

ANN TOP 10