AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అల్లు అర్జున్‌పై చర్యలు చేపట్టాలి.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు

ప్రచార మోజుతో ఓ మహిళ మరణానికి కారణమైన టాలీవుడ్‌ హీరో అల్లు అర్జున్‌తోపాటు ‘పుష్ప-2’ ప్రొడక్షన్‌ టీం, సంధ్య థియేటర్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బీసీ పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌ రాచాల యుగంధర్‌గౌడ్‌ కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు సమర్పించారు.

అనంతరం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 4న హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప-2’ ప్రీమియర్‌ షో సందర్భంగా అల్లు అర్జున్‌ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో తొక్కిసలాట జరిగిన దుర్ఘటనపై మానవ హక్కుల కమిషన్‌ జోక్యం చేసుకోవాలని, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10