AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రాబోయే రోజుల్లో భయంకరమైన ఎండలు

రాబోయే 90 రోజులు.. ఏప్రిల్, మే, జూన్ నెలల్లో దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని హెచ్చరించింది భారత వాతావరణ శాఖ. ఏప్రిల్ ఒకటో తేదీని విడుదల చేసిన ప్రకటనలో.. ఈ మేరకు ప్రజలను అలర్ట్ చేసింది. సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని స్పష్టం చేసింది. మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని ప్రాంతాల్లో వేడిగాలులు ఉంటాయని వార్నింగ్ బెల్స్ మోగించింది వెదర్ డిపార్ట్ మెంట్.

ప్రస్తుతం దేశంలో చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయని.. ఇవన్నీ ఏప్రిల్ పదో తేదీ వరకు మాత్రమే కురుస్తాయని.. ఆ తర్వాత ఎండలు బాగా ఉంటాయని వెల్లడించింది వాతావరణ శాఖ. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అత్యధికంగా ఉంటాయని.. వేడి గాలులతో జనం ఇబ్బందులు పడతారని ప్రకటించారు వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలు అయిన తెలంగాణ, ఆంధ్రలోనూ అత్యధిక టెంపరేచర్ నమోదు అవుతుందని.. కొన్ని ప్రాంతాల్లో 48, 49 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందని.. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే అమ్మో ఎండలు అంటున్నారు.. ఇక రాబోయే 90 రోజులు ఉక్కబోత తప్పదు.. బయటకు వెళితే మాడు పగలటం ఖాయం.. సో.. బీ కేర్ ఫుల్..

ANN TOP 10