AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రిపోర్టర్ రంజిత్‌ను కలిసి సారీ చెప్పిన మోహన్ బాబు..

నటుడు మోహన్‌బాబు దిగివచ్చి బహిరంగ క్షమాపణ చెప్పారు. ఆయన దాడిలో తీవ్రంగా గాయపడి యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రంజిత్‌ను పరామర్శించారు. రంజిత్‌కు, కుటుంబసభ్యులకు సారీ చెప్పారు మోహన్ బాబు.  నా రూటే సెపరేటు.. నేను కొట్టినా రైటేనంటూ సమర్థించుకున్న మోహన్‌బాబు..   జర్నలిస్ట్‌ రంజిత్‌పై హత్యాయత్నం చేసిన మోహన్‌బాబు  , జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.

ఆస్పత్రికి వెళ్లి రంజిత్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సమాజానికి సారీ చెప్పాలని రంజిత్ కోరడంతో.. మోహన్ బాబు ఆ మేరకు జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పారు.  దాడి రోజు తన వల్లే తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. ఆ గాయం బాధ తనకు తెలుసంటూ రంజిత్ కుటుంబ సభ్యలను క్షమాపణ కోరారు. రంజిత్ త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు మోహన్ బాబు. ఈ సమయంలో మంచు విష్ణు కూడా మోహన్ బాబుతో ఉన్నారు.

ANN TOP 10