ఏకంగా అన్ని కోట్లతో బిగ్గెస్ట్ డీల్..!
పుష్ప 2 ది రూల్ పేరుతో రూపొందుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాకు సంబంధించి ఓ అప్ డేట్ బయటకొచ్చింది. షూటింగ్ దశలోనే ఈ సినిమాకు భారీ రేంజ్ బిజినెస్ ఆఫర్స్ వస్తుండటం బన్నీ సత్తా రుజువు చేస్తోంది. అల్లు అర్జున్- సుకుమార్ సక్సెస్ఫుల్ కాంబోలో వచ్చిన పుష్ప మూవీ భారీ హిట్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో సుకుమార్ దీని సీక్వల్ రూపొందిస్తున్నారు. అంతకుమించి అన్నట్లుగా గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు.
ఎంతో గ్రాండ్ గా పుష్ప 2 మూవీని ప్లాన్ చేసిన సుక్కు.. సర్వ హంగులతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాకు భారీ ఆఫర్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. పలు బడా సంస్థలు వందల కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు టాక్. దీంతో అల్లు అర్జున్ రేంజ్ ఏంటనేది మరోసారి స్పష్టమవుతోంది.
పుష్ప మొదటి భాగంతో అటు అల్లు అర్జున్, ఇటు రష్మిక మందన్న పాన్ ఇండియా క్రేజ్ కొట్టేశారు. బీటౌన్ లో కూడా పాపులర్ అయ్యారు. బన్నీ మాస్ లుక్‌కి తోడు రష్మిక మందన్న స్క్రీన్ ప్రెజెన్స్ అన్నివర్గాల ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసింది. రష్మిక చేసిన శ్రీవల్లి పాత్ర నార్త్ లో ఆమె క్రేజ్ రెట్టింపు చేసింది.
కాగా.. ఏప్రిల్ 8 (అల్లు అర్జున్ పుట్టిన రోజు) సందర్భంగా పుష్ప 2 నుంచి సర్ప్రైజింగ్ అప్ డేట్ ఇవ్వబోతున్నారట. ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయబోతున్నారట.