AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కంటెయినర్‌ను ఢీకొట్టిన పికప్‌ వ్యాన్‌.. ఏడుగురు దుర్మరణం

యూపీ లో ఘోర రోడ్డు ప్రమాదం   జరిగింది. హత్రాస్‌ జిల్లా   లో ఓ కుటుంబం వెళ్తున్న పికప్‌ వ్యాన్‌ను భారీ కంటెయినర్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆ కుటుంబానికి చెందిన ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులు, ఒక చిన్నారి ఉన్నారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ప్రమాద సమాచారం అందిన వెంటనే స్థానిక పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. కాగా ఘటనపై యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇవ్వనున్నట్లు తెలిపారు.

ANN TOP 10