AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సోదరుల మధ్య గొడవలు సహజం.. మేం అంతర్గతంగా పరిష్కరించుకుంటాం

ఏ ఇంట్లోనైనా సోదరుల మధ్య గొడవలు సహజమని, తమ ఇంట్లోనూ అలాంటి విభేదాలు వచ్చాయని సినీనటుడు మోహన్‌బాబు అన్నారు. వాటిని పరిష్కరించుకుంటామని తెలిపారు. కుటుంబ వివాదం నేపథ్యంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతంలో ఎన్నో కుటుంబాల సమస్యలను తాను పరిష్కరించినట్లు మోహన్‌బాబు చెప్పారు. చాలా కుటుంబాలు కలిసేలా చేశానన్నారు.

సన్నిహితుల సమక్షంలో చర్చలు
మరోవైపు కుటుంబ వివాదం నేపథ్యంలో మోహన్‌బాబు నివాసంలో చర్చలు జరుగుతున్నాయి. జల్‌పల్లిలోని నివాసంలో సన్నిహితుల సమక్షంలో మోహన్‌బాబు, విష్ణు, మనోజ్‌ మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. పెద్ద మనుషుల సమక్షంలో మోహన్‌ బాబు, మనోజ్‌ వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. విదేశాల నుంచి విష్ణు తిరిగి రావడంతో ఈ ముగ్గురూ చర్చలు జరుపుతున్నారు.

ANN TOP 10