బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్యకు మళ్లీ రాజ్యసభ పదవి వరించింది. భారతీయ జనతా పార్టీ ఆర్ కృష్ణయ్యను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఈ క్రమంలో ఆర్ కృష్ణయ్య మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మళ్లీ రాజ్యసభ పదవి వరించడంతో ఆర్ కృష్ణయ్యకు బీసీ సంఘాల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే..
వైసీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన కృష్ణయ్య తన పదవీకాలం మరో నాలుగేళ్లు ఉండగానే తన పదవికి ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అనేక బీసీ ఉద్యమాలకు నాయకత్వం వహించారు. బీసీల రిజర్వేషన్లు, వారి అభివృద్ధి కోసం అనేక పోరాటాలు నిర్వహించారు.