AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వం..  బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణ తల్లి విగ్రహం మార్పు మూర్ఖత్వమని.. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా? అంటూ బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో.. సభలో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన ఆదివారం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మార్పులు చేసుకుంటూ పోతే ఎలా? అని నిలదీశారు. ప్రభుత్వం సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలన్నారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనసభ సమావేశాలకు హాజరుకావాలని సూచించారు. అంశాలవారీగా ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలన్నారు.

నిర్బంధ పాలనపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని.. అంశాలవారీగా ప్రభుత్వాన్ని నిలదీయాలంటూ కేసీఆర్ సూచించారు. రైతుబంధు ఉద్దేశం, ప్రయోజనాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోఆధారంగా వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ఫిబ్రవరిలో బీఆర్ఎస్‌ బహిరంగ సభ నిర్వహిస్తామని.. కాంగ్రెస్ సర్కార్ వైఖరి ఎండగడతామని కేసీఆర్ పేర్కొన్నారు. ఫిబ్రవరి తర్వాత బీఆర్ఎస్ కమిటీలు ఏర్పాటు చేస్తామని.. కమిటీల ఏర్పాటు తర్వాత సభ్యత్వ నమోదు ఉంటుందని కేసీఆర్ తెలిపారు.

బీఆర్ఎస్ సమావేశంలో కేసీఆర్..

తెలంగాణ అసెంబ్లీ, మండలి సమావేశాల్లో, ఎలాంటి వ్యూహం అనుసరించాలి అనేదానిపై…బీఆర్‌ఎస్‌ సభ్యులకు కేసీఆర్‌ మార్గదర్శనం చేశారని మాజీ మంత్రి హరీష్‌ రావు చెప్పారు.

 

ANN TOP 10