AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీఆర్‌ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలు

హైదరాబాద్: తెలంగాణ భవన్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మహారాష్ట్ర రైతు సంఘాల నేతలతో భేటీ అయ్యారు. కేసీఆర్‌ సమక్షంలో మహారాష్ట్ర నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. మహారాష్ట్ర రైతు నేత శరద్ జోషీ, ప్రణీత్, పలువురు రైతు నేతలు బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. వారికి గులాబీ కండువా కప్పిన సిఎం వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్య‌క్ర‌మంలో బీఆర్‌ఎస్‌ కిసాన్ స‌మితి జాతీయ అధ్య‌క్షుడు గుర్నామ్ సింగ్ చ‌డునీ, మ‌హారాష్ట్ర కిసాన్ స‌మితి అధ్య‌క్షుడు మాణిక్ క‌దం, మంత్రులు స‌త్య‌వ‌తి రాథోడ్, తన్నీరు హ‌రీశ్‌ రావు, ఎమ్మెల్యే జీవ‌న్ రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డితో పాటు పలువురు నేత‌లు పాల్గొన్నారు.

ANN TOP 10