AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నా హృదయం ఉప్పొంగుతోంది.. నాగార్జున

అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ వివాహం బంధంతో ఒక్కటైనా విషయం తెలిసిందే. హైదరాబాద్ ఐకానిక్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో అత్యద్భుతమైన టెంపుల్ థీం సెటప్‌తో సాంప్రదాయ పద్ధతిలో నాగ చైతన్య, శోభితా ధూళిపాళల వివాహం గ్రాండ్‌గా జరిగినందుకు సంతోషం వ్యక్తం చేసింది అక్కినేని కుటుంబం. లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి, దిగ్గజ నటుడు-నిర్మాత శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న మొదటి ప్రధాన వేడుక అయినందున ఈ ప్రత్యేక సందర్భానికి గొప్ప సెంటిమెంట్ వ్యాల్యూని అక్కినేని ఫ్యామిలీ జత చేసింది. ఈ సందర్భంగా నాగార్జున మరోసారి తన కృతజ్ఞతను ప్రకటించారు.

తాజాగా ఆయన ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేస్తూ.. “నా హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతోంది. ప్రత్యేకంగా మీడియా.. మీరు మమ్మల్ని అర్థం చేసుకొని, మా ఆనంద క్షణాలని మరింత ఆస్వాదించేలా చేశారు. మీ అమూల్యమైన సమయం మాకు కేటాయించనందుకు ధన్యవాదాలు. మా ప్రియమైన స్నేహితులు, కుటుంబ సభ్యులు, అభిమానులు మీ ప్రేమ, ఆశీర్వాదాలు నిజంగా ఈ సందర్భాన్ని మరువలేనివిగా చేశాయి. నా కొడుకు పెళ్లి కేవలం కుటుంబ వేడుక మాత్రమే కాదు. మీ అందరి మద్దతు మాకు ఓ జ్ఞాపకంగా మారింది.మీరు మాపై కురిపించిన లెక్కలేనన్ని ఆశీర్వాదాలకు అక్కినేని కుటుంబం తరపున అందరికీ ధన్యవాదాలు” అంటూ రాసుకొచ్చారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10