AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కోహ్లీ ఫిట్‌నెస్‌ సీక్రెట్‌ బయటపెట్టిన అనుష్క.. ఆ మూడింటికే అధిక ప్రాధాన్యం

స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli) ఫిట్‌నెస్‌కి అధిక ప్రాధాన్యం ఇస్తాడన్న విషయం అందరికీ తెలిసిందే. ప్రపంచంలోని ఫిట్టెస్ట్‌ క్రికెటర్  ఎవ‌రు? అని అడిగితే.. కోహ్లీ అని ఎవ‌రైనా ఠ‌క్కున చెప్పేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. నిరంతరం కష్టపడుతూ తన శరీరాన్ని దృఢంగా ఉంచుకుంటాడు. ఆట‌తో పాటు ఫిట్‌నెస్‌తో విరాట్‌ కోట్లాది మంది అభిమానుల మ‌న‌సు గెలిచాడు. ఫిట్‌నెస్‌లో భారత క్రికెట్‌ జట్టు సభ్యులందరూ విరాట్‌ను స్ఫూర్తిగా తీసుకుంటారు. వ్యాయామం, డైట్‌కు అంతలా ప్రాధాన్యమిస్తాడు ఈ స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.

అయితే, కోహ్లీ ఫిట్‌నెస్‌ వెనుక ఉన్న రహస్యాన్ని (Kohli Fitness Secret) ఆయన సతీమణి, స్టార్‌ నటి అనుష్క శర్మ (Anushka Sharma) తాజాగా బయటపెట్టారు. కోహ్లీ మూడింటికే అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పుకొచ్చారు. ఫిట్‌నెస్‌, ఆహారం విషయంలో క్రమశిక్షణతో ఉంటారని తెలిపారు. రోజూ ఉదయం లేవగానే కార్డియో వర్కవుట్స్‌ చేస్తారని వెల్లడించారు. తనతో క్రికెట్‌ కూడా ప్రాక్టీస్‌ చేస్తారని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక ఆహారం విషయానికి వస్తే.. జంక్‌ ఫుడ్‌ అస్సలు తినరని, కూల్‌ డ్రింక్స్‌ వంటి వాటికి దూరంగా ఉంటారని స్పష్టం చేశారు. కోహ్లీ దాదాపు 10 ఏళ్లుగా బటర్‌ చికెన్‌ తినలేదని అనుష్క చెప్పుకొచ్చారు. ఇక కోహ్లీ నిద్రకు కూడా తగిన ప్రాధానత్య ఇస్తారని తెలిపారు. నిద్ర విషయంలో అస్సలు రాజీపడరని చెప్పారు. దాదాపు ఎనిమిది గంటలపాటు ప్రశాంతంగా నిద్రపోతారని వివరించారు. మంచి నిద్రతో తగిన విశ్రాంతి పొందుతాడని అనుష్క తెలిపారు.

ANN TOP 10