AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మొదలైన పుష్ప హంగామా.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులో అల్లు అర్జున్‌ సందడి

ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 హంగామా మొదలైంది. ఇప్పటికే పలు దేశాల్లో స్క్రీనింగ్ ప్రారంభంకాగా. భారత్‌లో మరికాసేపట్లో సినిమా విడుదలకానుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద అభిమానుల సందడి మొదలైంది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులో అల్లు అర్జున్ అభిమానుల సందడి చేశారు. పుష్ప2 ప్రిమియర్ షో కోసం బన్నీ సంధ్య థియేటర్ కు వచ్చారు. అభిమానులతో కలిసి పుష్ప2 చిత్రాన్ని బన్నీ వీక్షించనున్నారు. అల్లుఅర్జున్ రాకతో ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు అభిమానులు భారీగా చేరుకున్నారు. అల్లుఅర్జున్ అభిమానులతో ఆర్టీసీ క్రాస్ రోడ్డు కిక్కిరిసిపోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పుష్ప2’  ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. RTC X Roads లోని సంధ్య 70mm థియేటర్ లో ఫ్యాన్స్ కలిసి సినిమా చూస్తున్నారు. ఇప్పటికే ప్రీమియర్ షో చూసేందుకు ఫ్యాన్స్ భారీ సంఖ్యలో టికెట్స్ బుక్ చేసుకున్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంధ్య థియేటర్ వద్దకు భారీగా చేరుకున్నారు. ఫ్యాన్స్ ఎక్కువగా రావడంతో ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది.

‘పుష్ప2’ ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్‌లలో విడుదల కానుంది. ‘‘అత్యధిక థియేటర్లలో ఐమాక్స్‌ ఫార్మాట్‌లో విడుదలవుతున్న భారతీయ చిత్రమిది. సినీడబ్స్‌ యాప్‌ సహాయంతో ఏ భాషతోనైనా ఈ సినిమాని చూసే అవకాశం ఉందని నిర్మాతలు చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ ‘సూసేసి’, ‘కిస్సిక్‌’ ‘పీలింగ్స్‌’ పాటలు సినిమాపై హై‌రేంజ్‌లో బజ్ క్రియేట్ చేశాయి.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10