AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

గూగుల్ మ్యాప్ ను ఫాలో అయ్యి… కాలువలో పడిపోయిన కారు.. యూపీలో ఘటన

మనం ఏదైనా కొత్త ప్రదేశానికి వెళుతున్నప్పుడు గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతుంటాం. చాలావరకు గూగుల్ మ్యాప్స్ యాప్ ఉపయోగకరంగానే ఉంటుంది. అయితే, ఉత్తరప్రదేశ్ లో గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవ్వాలన్న ఓ వ్యక్తి నిర్ణయం వికటించింది.

గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వెళ్లిన కారు… నేరుగా ఓ కాలువలో పడిపోయింది. యూపీలోని రాయ్ బరేలీ-పిలిభిత్ రహదారిపై ఈ ఘటన జరిగింది.

దివ్యాన్షు సింగ్ అనే వ్యక్తి తన కారులో మరో ఇద్దరితో కలిసి ప్రయాణిస్తున్నాడు. ఆ రూట్ కు కొత్త కావడంతో గూగుల్ మ్యాప్స్ ఉపయోగించాడు. అయితే, గూగుల్ మ్యాప్స్ సందేశాలను పక్కాగా అనుసరిస్తూ వెళ్లిన ఆ కారు బర్కాపూర్ గ్రామం సమీపంలో కాలాపూర్ కెనాల్ లో పడిపోయింది. రోడ్డు కోతకు గురైన విషయం గమనించకుండా, గూగుల్ సందేశాల ప్రకారం డ్రైవ్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.

కాగా, కారులోని ముగ్గురికీ ఎలాంటి హాని జరగలేదు. ప్రమాదంపై స్పందించిన అధికారులు ఓ క్రేన్ ను తెప్పించి, కాలువలో పడిపోయిన కారును బయటికి తీశారు. గత పది రోజుల వ్యవధిలో ఇలాంటి ఘటన జరగడం రెండోసారి.

ఇటీవల గూగుల్ మ్యాప్స్ ను ఫాలో అవుతూ వచ్చిన ఓ వాహనం సగం పూర్తయిన ఫ్లైఓవర్ పైనుంచి కిందడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం చెందారు.

ANN TOP 10