AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రోడ్డుపై చిరుత.. అయ్యో పాపం ఎంతపనైంది.. నొప్పితో తల్లడిల్లుతూ..!

తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఇటీవలే కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో చిరుత పులి సంచారించగా.. ఇద్దరు వ్యక్తులపై దాడి కూడా చేసింది. దీంతో.. అక్కడి స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన మర్చిపోకముందే.. మరో చిరుతి పులి తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈసారి నిజామాబాద్ జిల్లాలో కనిపించిన చిరుతను చూసి భయపడాల్సిన జనాలు.. అయ్యో పాపం ఎంతపనైందని జాలిపడుతున్నారు. అదేంటీ అనుకుంటున్నారా..?

నిజామాబాద్ జిల్లా చంద్రయాన్ పల్లి దగ్గి అటవీ ప్రాంతంలో మంగళవారం (డిసెంబర్ 03న) రాత్రి సమయంలో.. నేషనల్ హైవే 44 పైకి ఓ చిరుత ఠీవీగా నడుచుకుంటూ వచ్చింది. అయితే.. ఎన్‌హెచ్ 44పై సాధారణంగానే వాహనాలు యమా స్పీడుతో దూసుకెళ్తుంటాయి. కాగా.. రాత్రి సమయంలో ఇంకాస్త వేగం పెంచుతుంటారు. ఈ విషయం తెలియని ఆ చిరుత.. దర్జాగా రోడ్డుపైకి వచ్చి.. దాటేందుకు ప్రయత్నించింది. అయితే..  అదే సమయంలో వేగంగా వస్తున్న ఓ కారు.. ఆ చిరుతను గమనించలేదో.. లేదా గమనించి దాన్ని దాటుకుని వెళ్లిపోదామనుకున్నాడో.. సడెన్‌గా కనిపించేసరికి కంట్రోల్ చేయలేకపోయాడో తెలియదు కానీ.. చిరుతను ఢీకొట్టాడు.  ఈ ప్రమాదంలో గాయపడిన చిరుత.. రోడ్డుపైనే కూలబడిపోయింది. కాళ్లకు తీవ్రగాయమైందేమో.. లేచి కూడా నిలబడలేకపోయింది.

రోడ్డుపై పడుకొని ఉండటంతో.. అదేదో ఆవో, ఎద్దో, మరోదో జంతువు అనుకుంటున్నారో ఏమో వాహనదారులు మాత్రం దర్జాగా రోడ్డుపై వెళ్లిపోతున్నారు. కానీ దగ్గరికి వచ్చి అది పులి అని గుర్తించి.. భయంతో వేగం పెంచేస్తున్నారు. కొంతమంది వాహనదారులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. అధికారులు రంగంలోకి దిగారు. గాయాలతో ఉన్న ఆ చిరుతను కొంతమంది వాహనదారులు దూరం నుంచి వీడియోలు తీయగా అవి కాస్త వైరల్ అవుతున్నాయి. రోడ్డుపై లేవలేని పరిస్థితి పడిపోయి ఉన్న చిరుత.. వచ్చీ పోయే వాహనాల శబ్ధంతో ఆ చిరుత భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉండటం చూసి.. వాహనదారులు అయ్యోపాపం అంటూ జాలిపడుతున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10