హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు.. ఆయా రద్దీ మార్గాల్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే.. వేగంగా గమ్యాలను చేసుకుంనేందుకు గానూ పలు మార్గాల్లో ఎలివేటెడ్ కారిడార్లను కూడా నిర్మిస్తోంది. ఇందులో భాగంగానే.. ఎన్‌హెచ్ 44లోని ప్యారడైజ్ జంక్షన్ నుంచి డైరీ ఫామ్ రోడ్డు వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు శ్రీకారం చుట్టింది. కాగా.. ఈ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే.. ప్యారడైజ్ ఎలివేటెడ్ కారిడార్ కోసం కావాల్సిన భూసేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ప్రాజెక్టుకు అవసరమైన 62,152 చదరపు గజాల (12.84 ఎకరాలు) స్థలాన్ని సేకరించేందుకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ భూములను తిరుమలగిరి మండలం భోలక్‌పూర్, తోకట్ట, సీతారాంపురం, బోవెన్‌పల్లి గ్రామాల పరిధిలోని భూములను సేకరించేందుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టయింది.
అయితే.. ప్రాజెక్ట్ కోసం సేకరించాల్సిన భూమిలో మతపరమైన నిర్మాణాలు, స్మశాన వాటికలు, విద్యా సంస్థలు, నివాస అపార్ట్మెంట్లు చాలా ఉండటంతో.. అధికారులకు పెద్ద సవాలుగా మారింది. 294.81 గజాల విస్తీర్ణంలో ఉస్మానియా పీజీ కాలేజీ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఓపెన్ ల్యాండ్ ఉండగా.. 4475.50 గజాల స్థలంలో ముస్లిం స్మశాన వాటిక, 3954.40 గజాల్లో మరో స్మశాన వాటిక, 1968.10 గజాల విస్తీర్ణంలో పోలీస్, ఎస్పీహెచ్ఎస్ పోర్ట్ ఆఫీస్, బోవెన్లోని ఓడరేవు క్రికెట్ క్వార్టర్స్, జడ్పీహెచ్ఎస్ మైదానాలు ఉన్నాయి. వీటితో పాటు.. పలు రెసిడెన్షియల్ అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగులు కూడా ఉండటం గమనార్హం.