తెలంగాణ & ఆంధ్రప్రదేశ్ సబ్ ఏరియా (TASA) జనరల్ కమాండింగ్ ఆఫీసర్ గా మేజర్ జనరల్ అజయ్ మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ సికింద్రాబాద్‌లో ఆయన బాధ్యతలు చేపట్టారు. మిశ్రా 1992లో ఆర్టిలరీ రెజిమెంట్‌లో చేశారు. ఖడక్వాస్లాలో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో, డెహ్రాడూన్‌లో ఇండియన్ మిలిటరీ అకాడమీలో ఆయన పనిచేశారు.
అజయ్ మిశ్రా వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ స్టాఫ్ కాలేజీ నుంచి గ్రాడ్యుయేషన్, ఆర్మీ వార్ కాలేజీ నుంచి హయ్యర్ కమాండ్ కోర్స్ పూర్తిచేశారు. న్యూఢిల్లీలోని నేషనల్ కాలేజీలో ప్రతిష్ఠాత్మకమైన NDC కోర్స్ కూడా చేశారు. ఉత్తర సహరిద్ధులపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఏళ్లు పనిచేసిన అనుభవం ఉంది. ఆయన వాస్తవాధీన రేఖ వెంబడి తన రెజిమెంట్‌ను, బ్రిగేడ్‌ను కమాండ్ చేశారు.
త్రివిధ దళాల్లో ఆయనకు పనిచేసిన అనుభవం ఉన్నది. ఆయన అందించిన సేవలకు గుర్తుగా రెండు పర్యాయాలు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కమెండేషన్ కార్డు అందుకున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అజయ్ మిశ్రా మాట్లాడుతూ.. తనకు అప్పగించిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తానని, TASA పురోగతికి కృషి చేస్తానని చెప్పారు.