AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

లంగర్‌హౌస్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నవ దంపతుల దుర్మరణం

నగరంలోని లంగర్‌హౌస్‌లో స్విఫ్ట్ కారు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో బైక్, ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌కై వెళుతున్న దంపతులు మృతి చెందారు. ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. కారు డ్రైవర్ వికారాబాద్ జిల్లా, మోద్కురుకు చెందిన ప్రణయ్‌గా పోలీసులు గుర్తించారు.

మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డ్రైవర్‌కు పోలీసులు డ్రంక్ డ్రైవన్ నిర్వహించగా మద్యం సేవించినట్లు నిర్దారణ అయింది. ఆటో రిక్షాలో ఉన్న మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ ప్రమాదంలో మృతి చెందిన నవ దంపతులు.. దినేష్ గోస్వామి, మోనా ఠాకూర్‌లుగా పోలీసులు గుర్తించారు. దంపతులు బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం దినేష్ పుట్టినరోజు ఉండడంతో వారు లంగర్ హౌస్‌‌కు వెళ్ళారు. లంగర్ హౌస్‌లోని యాదవ బస్తీలో మోనా ఠాకూర్ తల్లిదండ్రులు ఉంటున్నారు. రాత్రి లంగర్ హౌస్ నుంచి నందినగర్ కు ద్విచక్ర వాహనంపై దంపతులు బయలుదేరారు. అదే సమయంలో మద్యం మత్తులో వేగంగా వచ్చిన కారు వారి వాహనాన్ని ఢీ కొట్టింది. తీవ్రంగా గాయపడిన దంపతులిద్దరూ ఘటనా స్థలంలోని మరణించారు. కాగా మొనా టాకుర్ రెండు నెలల గర్భిణి. ఇంటి నుండి బయలుదేరి కిలోమీటర్ దూరం రాగానే ప్రమాదం జరిగింది. నవ దంపతుల మరణ వార్త తెలుసుకొన్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీురుగా విలపిస్తున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10