AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలోనూ ఫెంగల్‌ ఎఫెక్ట్‌.. నేడు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ
అప్రమత్తమైన రాష్ట్ర యంత్రాంగం

బంగాళాఖాతంలో ఏర్పడి తీరం దాటిన ఫెంగల్‌ తుపాను ప్రభావంతో తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆది, సోమవారాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఈ క్రమంలో ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలోని పెంగల్‌ తుపాను శనివారం రాత్రి తీరాన్ని తాకడంతో దీని ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం తో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురుస్తున్నాయి. ఓ వైపు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ఫెంగల్‌ తుపాను బీభత్సం సృష్టిస్తుంది. ఇక దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంపై కూడా కనిపిస్తుంది.

రాష్ట్రంలోని ఈ జిల్లాల్లో ఎల్లో అలర్ట్‌ జారీ..
తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ అయింది. డిసెంబర్‌ రెండవ తేదీన మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని భారతవాతావరణ శాఖ పేర్కొంది.

అలాగే డిసెంబర్‌ 2 వ తేదీన కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌గర్, వనపర్తి, నారాయణపేట గద్వాల జిల్లాలలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలన్నింటికి ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది. డిసెంబర్‌ 3వ తేదీ నుంచి ఆరవ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎటువంటి హెచ్చరికలు లేవని వాతావరణ శాఖ పేర్కొంది.

ANN TOP 10