న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు దేశీయ చమురు కంపెనీలు కాస్త ఊరట కలిగించాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.91.50 తగ్గించాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య సిలిండర్ ధర రూ.2028కు చేరింది. తగ్గిన ధరలు నేటినుంచే అమల్లోకి వస్తాయని చమురు కంపెనీలు ప్రకటించాయి. అయితే గృహావసరాలకు వినియోగించే 14.2 కేజీల సిలిండర్ ధరలు యథాతథంగా కొనసాగనున్నాయి.