జాతీయ రహదారి 161పై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం కన్సాన్ పల్లి దగ్గర శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే బస్సు బ్రిడ్జి రెయిలింగ్ పైకి ఎక్కి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ప్రమాద సమాచారం అందిన వెంటన పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. గాయపడిన ప్రయాణికులను జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడిన ప్రయాణికులను వేరే బస్సుల్లో వారి గమ్య స్థానాలకు చేర్చారు.