AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఏపీ హైకోర్టులో రాంగోపాల్‌ వర్మ క్వాష్‌ పిటిషన్‌ వాయిదా

ప్రముఖ టాలీవుడ్‌ డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ  దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌   పై హైకోర్టులో  విచారణ వచ్చే సోమవారానికి వాయిదా పడింది. ఏజీ వచ్చి వాదనలు వినిపిస్తారని, అందుకు సమయం కావాలని ప్రభుత్వ న్యాయవాది కోరిన మీదట న్యాయమూర్తి విచారణను వాయిదా వేశారు.

ఈ సందర్భంగా ఆర్జీవీ తరఫు న్యాయవాదుల వాదనలు వినిపిస్తూ ఒకే అంశంపై పలుచోట్ల కేసులు పెడుతున్నారంటూ ఆరోపించారు. ఏపీ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  , మంత్రి నారా లోకేశ్‌   పై ఫొటోలు మార్ఫింగ్   చేసి సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు పెట్టినందుకుగాను రాంగోపాల్‌ వర్మపై ఒంగోలు, విశాఖ, గుంటూరు జిల్లాలో కేసులు  నమోదయ్యాయి.

ఈ కేసులపై పోలీసులు రెండు సార్లు నోటీసులు అందించినా వర్మ విచారణకు హాజరు కాకపోవడంతో పోలీసులు హైదరాబాద్‌, తమిళనాడులో గాలింపులు ప్రారంభించారు. ఇప్పటికే నాలుగురోజులు కావస్తున్న ఆర్జీవీ జాడను పోలీసులు కనుగొనలేక పోతున్నారు. ఈ క్రమంలో హైకోర్టులో ఆర్జీవీ ముందస్తు బెయిల్‌ కోరుతూ పిటిషన్‌ వేయగా గత మంగళవారం కోర్టు విచారణ జరిపి వేసింది.

ANN TOP 10