మాదాపూర్‌లో దారుణం జరిగింది. మై హోమ్ భుజ (My Home Bhuj) తొమ్మిదవ అంతస్తుపై (9th floor) నుంచి ఓ యువతి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందింది. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన అశ్విత సింగ్(25) (Ashvita Singh) సరోగసి (Surrogacy) ద్వారా పిల్లలను కనివ్వడం కోసం అశ్విత సింగ్‌ను రాజేష్ బాబు (Rajesh Babu) అనే వ్యక్తి తీసుకువచ్చాడు.
పిల్లలను కనివ్వడం కోసం ఆ యువతితో రూ. 10 లక్షల డీల్‌ను కుదుర్చుకున్నాడు. అయితే కొన్నాళ్లుగా రాజేష్ బాబు ప్రవర్తన నచ్చకపోవడంతో యువతి అశ్విత సింగ్ పారిపోవడానికి ప్రయత్నించింది. తప్పించుకునే క్రమంలో ప్రమాదవశాత్తు మై హోమ్ భుజ తొమ్మిదవ అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందింది. ఆమెకు భర్త, నాలుగు సంవత్సరాల బాబు ఉన్నాడు. సమాచారం అందుకున్న రాయదుర్గం పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. రాజేష్ బాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.