పులి కంట పడిన జంతువైనా, మనిషి అయినా తప్పించుకోవడం దాదాపు అసాధ్యం. ఒక్కసారిగా దాని కంటపడగానే వెతికి వెతికి మరీ వేటాడుతుంది. అయితే కొన్నిసార్లు కొన్ని జంతువులు పులి నోటిదాకా వెళ్లి అదృష్టవశాత్తు తప్పించుకుంటుంటాయి. అలాగే మనుషులు కూడా పులులు కళ్లగప్పి ప్రాణాలతో బయటపడుతుంటారు. ఇలాంటి వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పులికి ఎదరుపడ్డ ఫారెస్ట్ గార్డ్ ఎంతో చాకచక్యంగా దాన్నుంచి తప్పించుకున్నాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ సాత్పురా అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నూలాల్, దహల్ అనే ఇద్దరు ఫారెస్ట్ గార్డ్‌లు విధుల్లో ఉండగా.. షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అడవిలో తిరుగుతున్న సమయంలో వారిలో ఓ వ్యక్తికి దూరంగా పెద్ద పులి (tiger) కనిపించింది. దీంతో వెంటనే అతను అప్రమత్తమయ్యాడు. ఎంతో చాకచక్యంగా సమీపంలోని ఓ పెద్ద చెట్టు ఎక్కేశాడు.
ఫారెస్ట్ గార్డ్‌లు పులికి కనిపించకుండా ఉండేందుకు పూర్తిగా చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు. ఆ చెట్టు సమీపానికి వచ్చిన పులి.. చాలా సేపు అక్కడే తచ్చాడుతూ కనిపించింది. ఈ క్రమంలో మధ్యలో చెట్టు పైన ఉన్న వ్యక్తిని కూడా గమనించింది. అయితే ఆ తర్వాత తన మనసు మార్చుకుని.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో వారిద్దకూ హమ్మయ్య.. అంటూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన మొత్తాన్ని ఆ వ్యక్తి తన ఫోన్ కెమెరాతో రికార్డ్ చేశాడు.
ఫారెస్ట్ గార్డ్‌కు ఎదురైన షాకింగ్ అనుభవాన్ని వివరిస్తూ.. ఐఎఫ్ఎస్ అధికారి పర్వీన్ కస్వాన్.. వీడియోను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎంతో అప్రమత్తంగా వ్యవహరించారు’’.. అంటూ కొందరు, ‘‘పులి కంట పడి కూడా తప్పించుకున్నారు.. ఇతడి టైం చాలా బాగుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3వేలకు పైగా లైక్‌లు, 2.15 లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.