AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రెహమాన్ నాకు తండ్రితో స‌మానం.. ఇప్ప‌టికైనా వాటికి ఫుల్‌స్టాప్ పెట్టండి: బాసిస్ట్ మోహినిదే

ఆస్కార్ అవార్డు విజేత‌, ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు ఏఆర్ రెహ‌మాన్, సైరా బాను దంప‌తులు త‌మ 29 ఏళ్ల వివాహ బంధానికి స్వ‌స్తి ప‌లుకుతూ ఇటీవ‌ల విడాకులు తీసుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే, ఈ విడాకుల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన కాసేప‌టికే త‌న భర్త నుంచి విడిపోతున్న‌ట్లు బాసిస్ట్ మోహినిదే వెల్ల‌డించ‌డంతో వారిద్ద‌రిని లింక్ చేస్తూ పుకార్లు పుట్టుకొచ్చాయి.

సామాజిక మాధ్య‌మాల్లో చాలా మంది ఈ విషయమై నెగటివ్‌గా మాట్లాడటం చేశారు. దాంతో ఇటీవ‌ల‌ ఈ విషయంపై స్పందించిన మోహినిదే ఆ రూమ‌ర్ల‌ను తీవ్రంగా ఖండించారు. ఇప్పుడు మరోసారి ఈ అంశంపై ఆమె స్పందించారు.

ఏఆర్‌ రెహమాన్‌ తనకు తండ్రితో సమానమని చెప్పారు. “ఏఆర్‌ రెహమాన్‌ నాకు తండ్రితో సమానం. ఎనిమిది ఏళ్ల‌ నుంచి ఆయన బృందంలో పనిచేస్తున్నాను” అని మోహిని పేర్కొన్నారు. త‌మ‌పై ఇలాంటి వార్త‌లు రావ‌డం చాలా బాధించింద‌ని ఆమె తెలిపారు.

రెహ‌మాన్ కుమార్తెల‌ది, త‌న‌ది ఒకే వ‌య‌సు ఉంటుందని, ఆయ‌న ఎప్పుడూ త‌న‌ను త‌న కుమార్తెలానే చూశార‌ని మోహినిదే అన్నారు. త‌న కెరీర్‌లో ఆయ‌న కీల‌కపాత్ర పోషించార‌ని, త‌న జీవితానికి రెహ‌మ‌న్ రోల్‌మోడ‌ల్ అని పేర్కొన్నారు. త‌మ‌పై ఇలాంటి రూమ‌ర్స్ రావ‌డం బాధాక‌రం అన్నారు. అస‌భ్య‌క‌రంగా మాట్లాడ‌డం నేరంగా ప‌రిగ‌ణించాల‌ని తెలిపారు.

ANN TOP 10