AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఇస్కాన్’ చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేసిన బంగ్లా ప్రభుత్వం

హిందువులపై జరుగుతున్న అకృత్యాలపై నిరసన గళం వినిపిస్తున్న ఇస్కాన్ (ISKCON)కు చెందిన కృష్ణదాస్ ప్రభు అలియాస్ చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి (Chinmoy Krishna Das Brahmachari)ని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం నిర్బంధంలోకి తీసుకుంది. ఢాకా నుంచి చిట్టగాంగ్ వెళ్లేందుకు హజ్రత్ షాజలాల్ అంతర్జాతీ విమానాశ్రయానికి సోమవారంనాడు వచ్చినప్పుడు ఆయనను బంగ్లాదేశ్ డిటిక్టివ్ బ్రాంచ్ అరెస్టు చేసింది.

మహమ్మద్ యూనిస్ సారథ్యంలోని బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ..చిన్మయ్ దాస్‌ అరెస్టును భారత సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అడ్వయిజర్ కంచన్ గుప్తా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ధ్రువీకరించారు.

ఇస్కాన్ సాధువు చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని యూనస్ రిజిమ్ పోలీసులు ఢాకాలో అరెస్టు చేశారు. హిందువులపై విద్వేష పూరితదాడులను వ్యతిరేకిస్తూ, ఇస్లా్మిస్టుల నుంచి వారిని కాపాడాలనే డిమాండ్‌తో భారీ హిందూ ర్యాలీకి ఆయన సారథ్యం వహించడంతో ఆయనపై దేశద్రోహం ఆరోపణలు మోపారు. హిందూ కమ్యూనిటీలో ప్రముఖుడిగా గుర్తింపుపొందిన చిన్మయ్ కృష్ణ దాస్ బ్రహ్మచారిని డిటెక్టివ్ బ్రాంచ్ పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారని తెలిసింది” అని కంచన్ గుప్తా తెలిపారు. దేశం విడిచి వెళ్లాల్సిందిగా చిన్మయ్ కృష్ణదాస్‌‌ను ఆదేశించినట్టు కూడా వార్తలు వెలువడుతున్నాయి.

ANN TOP 10