కుమ్రం భీం ఆసిఫాబాద్ : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన అశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌కి గురై గత కొన్ని రోజులుగా నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ సోమవారం మృతి చెందింది. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరగగా 64 మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ముగ్గురు పరిస్థితి సీరియస్‌గా ఉండడంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేర్పించారు.
వీరిలో ఇద్దరు కోలుగా శైలజ పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. దాదాపు 20 రోజులుగా చికిత్స పొందిన ఆమె చివరకు మృత్యువాత పడ్డారు. శైలజ మృతితో తల్లిదండ్రులు, బంధువు ల రోదనలు మిన్నంటాయి. కాగా, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గురుకుల పాఠశాలలు అధ్వాన్నంగా మారి విద్యార్థులు చనిపోతున్నారని అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి.