కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలికి భరోసా
కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు ఉయిక ఇందిరను ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి కంది శ్రీనివాసరెడ్డి సతీమణి కంది మౌన శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఉయిక ఇందిర భర్త తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉయిక సంజీవ్ ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ నేపథ్యంలో మౌనారెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం అందించారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఏ ఆపద వచ్చినా అందుబాటులో ఉంటామంటూ ఓదార్చారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ రావు, ఆదిలాబాద్ రూరల్ మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అల్చెట్టి నాగన్న, గ్రామ పటేల్ ఎర్మ విఠల్, ఆత్రం నగేష్, ఉయిక రమేష్, తుమ్రం కిషన్, నాయకులు బోనగిరి సంటన్న, బూర్ల శంకరయ్య, దాసరి ఆశన్న తదితరులు ఉన్నారు.