AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బెస్ట్‌ సీఎం రేవంత్‌ రెడ్డే.. బండ్ల గణేశ్‌ ప్రశంసలు

ఆయనది మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ
సీఎం అనే అహం అస్సలు లేదు..

దేశంలోని 29 రాష్ట్రాల్లో బెస్ట్‌ సీఎం రేవంత్‌ రెడ్డి అంటూ టాలీవుడ్‌ నిర్మాత, నటుడు బండ్ల గణేష్‌ ప్రశంసలు కురింపించారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో బండ్ల మాట్లాడుతూం ఆయనది మిడిల్‌ క్లాస్‌ మెంటాలిటీ అని చెప్పారు. ముఖ్యమంత్రిని అనే అహంభావం అస్సలు లేదని అన్నారు. ఇదివరకు ఉన్న సీఎంను కలవాలంటే ఎంత కష్టం ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. పదేళ్లపాటూ మంత్రులనే కలవలేదని చెప్పారు.

ఎవరినైనా ఆప్యాయంగా పిలుస్తారు..
రేవంత్‌ రెడ్డికి ఉన్న బ్యూటీ.. వాళ్ల కుటుంబమే అని కొనియాడారు. ఎవరని అయినా రేవంత్‌ రెడ్డి గుర్తుపెట్టుకుని పేరు పెట్టి పిలుస్తారని చెప్పారు. ఇదిలా ఉంటే బండ్ల గణేష్‌ నిర్మాతగా, నటుడుగా ఎంతో పేరు సంపాదించుకున్నారు. మొదట కమిడియన్‌ గా కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆ తరవాత నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. తీన్‌ మార్‌ సినిమాకు నిర్మాతగా చేయగా ఆ సినిమా నష్టాలను తెచ్చిపెట్టింది. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా పవన్‌ కల్యాణ్‌ తో గబ్బర్‌ సింగ్‌ సినిమాను నిర్మించారు.

సినిమాలే కాకుండా బండ్ల రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ నుండి ఆయన ఎమ్మెల్యే టికెట్‌ కూడా ఆశించారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ టికెట్‌ దక్కకపోయినా కాంగ్రెస్‌ పార్టీలోనే కొనసాగుతూ పార్టీకి సేవలందిస్తున్నారు. ఇక గతంలో చాలా సార్లు తనకు రేవంత్‌ రెడ్డి అంటే అభిమానం అని చెప్పగా మరోసారి ఇంటర్వ్యూలో రేవంత్‌ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు.

ANN TOP 10