AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నక్సల్స్‌ ఘాతుకం.. పంచాయతీ సెక్రటరీ సహా ఇద్దరి దారుణ హత్య

నిద్రపోతున్న సమయంలో ఇంట్లోకి దూరి గొడ్డలితో దాడి
పోలీసుల ఇన్‌ఫార్మర్ల నెపంతో మట్టుబెట్టిన మావోయిస్టులు
మృతదేహాల వద్ద రెండు లేఖలు
ములుగు జిల్లా వాజేడులో ఘటన

ములుగు జిల్లా వాజేడులో నక్సల్స్‌ రెచ్చిపోయారు. పోలీస్‌ ఇన్‌ఫార్మర్ల నెపంతో ఇద్దర్ని మావోయిస్టులు అతి దారుణంగా హత్య చేశారు. ఈ సందర్భంగా మావోయిస్టులు ఒక లేఖ విడుదల చేశారు. ఈ ఇద్దర్నీ పలుమార్లు హెచ్చరించినా వారు తీరు మార్చుకోలేదంటూ అందులో పేర్కొన్నారు. ఇంట్లోకి చొరబడి నిద్రపోతున్నవారిని నరికి చంపారు. వారి చేతిలో గొడ్డలి లాక్కుని అడ్డుకోడానికి మృతుడి భార్య తీవ్రంగా ప్రయత్నించింది. కానీ, ఆమె ప్రయత్నం విఫలమైంది. ఈ ఘటనతో తెలంగాణ ఉలిక్కిపడింది.

అతికిరాతకంగా..
వాజేడు పెనుగోలు కాలనీలో పేరూరు పంచాయతీ కార్యదర్శి ఉయికా రమేశ్, అతడి బంధువు ఉయికా అర్జు¯Œ ను గురువారం అర్ధరాత్రి అతి కిరాతకంగా నరికి చంపారు. అనంతరం వారి మృతదేహాల వద్ద వెంకటాపురం–వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట మావోయిస్టులు రెండు లేఖలను వదిలి వెళ్లారు. రమేశ్‌ను గొడ్డలితో నరికిన సమయంలో అతడి భార్య గట్టిగా కేకలు వేయడంతో మావోయిస్టులు అక్కడి నుంచి పరారయ్యారు.

గతంలో ఇద్దరికీ హెచ్చరికలు..
రమేశ్, అర్జున్‌ ఇద్దరు తరచూ అడవిలోకి వెళ్తూ నక్సల్స్‌ కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు పోలీసులకు సమాచారం ఇస్తున్నారని అనుమానం పెంచుకున్నారు. గతంలో ఇద్దరికీ హెచ్చరికలు చేసిన మావోయిస్టు పార్టీ.. తీరు మార్చుకోకపోతే చంపుతామని వార్నింగ్‌ ఇచ్చింది. ఈ క్రమంలో గురువారం రాత్రి వారి నివాసాల్లోకి నక్సల్స్‌ చొరబడ్డారు. ఇంట్లోకి వచ్చి నిద్రపోతున్నవారిపై గొడ్డలితో దాడిచేశారు. రమేశ్‌ భార్య వారి నుంచి గొడ్డలి లాక్కోవడానికి ప్రయత్నించారు. కొంతసేపు ఆమె వారితో పెనుగులాడారు. ఆమెను పక్కకు నెట్టేసి గొడ్డలి లాక్కుని నరికేశారు. ఆమె కేకలు చుట్టుపక్కల ఉన్నవారు రావవడంతో నక్సల్స్‌ పరారయ్యారు. మావోయిస్ట్‌ల హత్యల గురించి మాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఉలిక్కిపడిన తెలంగాణ
ఈ ఘటనతో మరోసారి తెలంగాణ ఉలిక్కిపడింది. మావోయిస్ట్‌ కదలికలపై ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఇటీవల గస్తీ కూడా పెంచారు. ఈ సమయంలో ఇద్దర్ని ఇన్‌ఫార్మర్‌ నెపంతో హత్య చేయడం గమనార్హం.

ANN TOP 10