AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

LICకి ఒక్కరోజే రూ.8700 కోట్లు నష్టం.. ఎందుకంటే..

భారత ప్రభుత్వ రంగ బీమా సంస్థ భారతీయ జీవిత బీమా కంపెనీ ఎల్ఐసీకి గురువారం భారీ నష్టాలు వచ్చాయి. స్టాక్ మార్కెట్లో ఆ సంస్థ పెట్టుబడులు దాదాపు రూ. 8700 కోట్లు తగ్గిపోయాయి. అందుకు ఒకే ఒక్క కారణం అదానీ. అదానీ గ్రూప్ కంపెనీల స్టాక్స్‌లో ఎల్ఐసీకి భారీగా పెట్టుబడులు ఉండగా.. ఇవాళ అదానీ షేర్లు కుప్పకూలాయి. దీంతో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఒక్క ట్రేడింగ్ సెషన్‌లోనే దాదాపు రూ. 8700 కోట్లకు పైగా సంపద తగ్గిపోవడం గమనార్హం. ఆ వివరాలు తెలుసుకుందాం.

అమెరికా ప్రాసిక్యూటర్లు గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్‌పై లంచం ఆరోపణలు చేశారు. ఏకంగా రూ. 2100 కోట్ల మేర భారత అధికారులకు సోలార్ ప్రాజెక్టు పొందేందుకు లంచం ఇవ్వజూపారని ఆరోపించారు. అలాగే ఇన్వెస్టర్లు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపించారు. ఈ అంశం అదానీ సహా 7 మందిపై అమెరికాలో కేసు నమోదైనట్లు సమచారం. ఈ క్రమంలో నవంబర్ 21వ తేదీన అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు ఏకంగా 23 శాతం మేర పడిపోయాయి.

ఇందులో అదానీ పోర్ట్స్ సంస్థలో ఎల్ఐసీ వాటా రూ. 2960.23 కోట్లు తగ్గిపోయింది. అత్యధికంగా అదానీ ఎంటర్‌ప్రైజెస్‌లో ఎల్ఐసీ పెట్టుబడుల విలువ రూ. 2995.37 కోట్లు పడిపోయింది. అంబుజా సిమెంట్స్‌లోని వాటాలో రూ. 822.34 కోట్లు కోసుకుపోయాయి. అదానీ టోటల్ గ్యాస్ సంస్థలోని విలువలో రూ. 462.80 కోట్లు తగ్గిపోయింది. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్‌లో రూ. 716.50 కోట్లు, అదానీ గ్రీన్ ఎనర్జీలో రూ. 571.64 కోట్లు, ఎసీసీ సిమెంట్స్‌లో రూ. 191.90 కోట్లు తగ్గింది.

ANN TOP 10