జజ్జనకరి జనాలే.. చేరికల జాతరే..
కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేఎస్‌ఆర్
ఏ ఎన్నికలు వచ్చినా గెలుపే లక్ష్యం కావాలంటూ పిలుపు
ప్రజా సేవాభవన్‌లో నిత్యం సందడి
కాంగ్రెస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి కంది శ్రీనివాస రెడ్డి నేతృత్వంలో చేరికలు ముమ్మరంగా కొన సాగుతున్నాయి. ప్రజా సేవాభవన్ ప్రతీ రోజు జన జాతరను తలపిస్తోంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నోముల చంద్రకాంత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ మడవి కిషన్, ఎల్మ రామ్ రెడ్డి, గంగన్న, ముత్తన్న, నగేష్, రమేష్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం అంకోలి గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారందరికీ కంది శ్రీనివాస రెడ్డి కండువాలు కప్పి చప్పట్లతో పార్టీలోకి స్వాగతించారు. ఈ సందర్భంగా కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ పార్టీ కి క్యాడర్ ఎంతో ముఖ్యమైందని అది కాపాడుకోవలసిన బాధ్యత ప్రతీ నాయకుడిపై ఉంటుందన్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలో నాయకుల కృషి వల్ల పార్టీ బలోపేతమవుతోందన్నారు. ఎలక్షన్లు ఏవి వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేయాలన్నారు.
అంకోలి గ్రామానికి 300 ఇందిరమ్మ ఇళ్లు..
అంకోలి గ్రామానికి 300 ఇళ్లు ఇప్పిస్తానని కంది శ్రీనివాసరెడ్డి హర్షధ్వానాల మధ్య వెల్లడించారు. తెలంగాణ ప్రభుత్వం 500 లకే గ్యాస్ సిలిండర్ , 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణ సదుపాయం కల్పించిందన్నారు. పేద ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు ముందుగా ఇస్తామన్నారు. అంకోలి గ్రామ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు. ఎప్పుడు ఏ పని మీద ఆదిలాబాద్‌కు వచ్చినా తన క్యాంప్ కార్యాలయానికి వచ్చి భోజనం చేయాలని కోరారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ లను, జెడ్పీటీసీ లను ఎంపీటీసీలను గెలిపించాలన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయటమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.