AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్రలో మహాయుతి కూటమిదే గెలుపు!.. ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా

ముంబై: మహారాష్ట్రలో మహాయుతి కూటమి రెండోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని మెజారిటీ ఎగ్జిట్‌పోల్స్‌ అంచనా వేశాయి.  అయితే ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (కూటమి) గట్టి పోటీ ఇస్తుందని మరికొన్ని సర్వేలు తెలిపాయి. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్‌ జరిగింది. నవంబర్‌ 23న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు.

కాగా,  బీజేపీ, ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో కూడిన మహాయుతికి 150 నుంచి 170 సీట్లు వస్తాయని మ్యాట్రిజ్ అంచనా వేసింది. కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ), శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) కూటమి 110 నుంచి 130 సీట్లు గెలుస్తుందని పేర్కొంది.

పీపుల్స్ పల్స్ కూడా మహాయుతి గెలుస్తుందని అంచనా వేసింది. ఈ కూటమికి 175–195 మధ్య సీట్లు వస్తాయని తెలిపింది. ఎంవీఏ కూటమికి 85–112 సీట్లు రావచ్చని అంచనా వేసింది.

మరోవైపు అధికార కూటమి 152–160 సీట్లు సాధిస్తుందని చాణక్య అంచనా వేసింది. ఎంవీఏ కూటమి 130-138 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పేర్కొంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10