AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

రేవంత్ రెడ్డీ… రాకెట్ వేగంతో తిరిగి వస్తా: లగచర్ల నిందితుడు సురేశ్

ఖబడ్దార్ రేవంత్ రెడ్డీ… మళ్లీ రాకెట్ వేగంతో తిరిగి వస్తానని లగచర్ల ఘటన కీలక నిందితుడు సురేశ్ అన్నాడు. వికారాబాద్ జిల్లా లగచర్లలో ఇటీవల కలెక్టర్, అధికారులపై రైతులు దాడి చేసిన వార్త సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులు పలువురు నిందితులను అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన నాటి నుంచి సురేశ్ పరారీలో ఉన్నాడు. అతను ఈ రోజు పోలీసుల ఎదుట లొంగిపోయాడు.

పోలీసులు అతనిని స్టేషన్‌లోకి తీసుకువెళుతున్న సమయంలో మీడియా అతనిని కొద్ది దూరం వెంబడించింది. అతను మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయడంతో ఓ పోలీస్ అతనిని లోనికి లాక్కెళ్లాడు. పోలీస్ లోనికి లాక్కెళుతున్న సమయంలోనూ అతను వెనక్కి తిరిగి… “నేను ప్రశ్నించే గొంతుకను… మళ్లీ రాకెట్ వేగంతో తిరిగి వస్తా… రైతుల పక్షాన మళ్లీ పోరాడుతాను… ఖబడ్దార్ రేవంత్ రెడ్డీ” అన్నాడు.

ANN TOP 10