AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హరీశ్ రావు పక్కచూపులు చూస్తుండు.. త్వరలో బీఆర్‌ఎస్‌ ఖాళీ.. TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

బీఆర్‌ఎస్‌లో ఎవరూ మిగలరని, హరీశ్ రావు కూడా పక్క చూపులు చూస్తున్నారని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కేసీఆర్, కేటీఆర్, కవితలే ఆ పార్టీలో ఉంటారని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో జనవరి నుంచి కొంతమందికి పదవులు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు సత్తా చాటాలని పిలుపునిచ్చారు. మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధాని కావాలని మహేశ్ కుమార్ గౌడ్ ఆకాంక్షించారు.

తెలంగాణ అభివృద్దికి సూచనలు చేయండి
తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి సలహాలు, సూచనలు ఇవ్వాలని తెలంగాణ మేధావుల ఫోరం సభ్యులకు టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బి మహేష్‌కుమార్‌ గౌడ్‌ పిలుపునిచ్చారు. సోమవారం టీపీసీసీ చీఫ్‌ నివాసంలో మహేష్‌కుమార్‌ గౌడ్‌కు మేధావుల ఫోరం ఇందిరాగాంధీ ఎక్సలెన్సీ అవార్డు – 2024 ను ప్రదానం చేసింది.

ఈ సందర్భంగా మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ… తెలంగాణ ప్రజలు జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి స్థాపనకు కట్టుబడి ఉన్నారని, వారిలో చీలికలు తేవడానికి మతతత్వ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రాజ్‌ నారాయణ ముదిరాజ్‌ తదితరులు మహేష్‌కుమార్‌ గౌడ్‌కు శాలువ, జ్ఞాపిక ,పూలమాలతో ఘనంగా సన్మానించి అవార్డును ప్రధానం చేశారు.

 

ANN TOP 10