AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

హాల్‌మార్కింగ్‌ లేని బంగారు ఆభరణాలపై కేంద్రం కీలక ప్రకటన..!

దేశవ్యాప్తంగా చాలాచోట్ల హాల్‌మార్కింగ్‌ లేని బంగారు ఆభరణాలను చాలాచోట్ల విక్రయాలు సాగుతున్నాయి. తాజాగా పలు రాష్ట్రాల్లోని 18 జిల్లాల్లో హాల్‌మార్కింగ్‌ లేని బంగారు ఆభరణాలను విక్రయించబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. హాల్‌మార్కింగ్ రూల్‌ జూన్ 23, 2021 నుంచి అమలులోకి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు రూ.40 కోట్ల బంగారు ఆభరణాలు హాల్‌మార్క్ అయ్యాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం వివిధ దశల్లో హాల్‌మార్క్‌ అమలు చేస్తూ వస్తున్నది.

అయితే, కల్తీ ఆభరణాల బారి నుంచి రక్షించేందుకు భారత ప్రభుత్వం ఇప్పడు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో హాల్‌మార్కింగ్‌ ఆభరణాల నియమాన్ని అమలు చేస్తోంది. ఈ రూల్‌ దేశంలో 23 జూన్ 2021లోనే రూపొందించింది. కానీ, వివిధ జిల్లాల్లో దశలవారీగా అమలు చేస్తున్నది. ఆంధ్రప్రదేశ్, బీహార్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కేరళ, ఒడిశా, పుదుచ్చేరి, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ 18 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో ఇలాంటి 361 జిల్లాలున్నాయి. ఇక్కడ హాల్‌మార్కింగ్‌ లేని నగలు విక్రయించరు. దేశంలోని ఆభరణాల రిజిస్ట్రేషన్‌పై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తోంది.

దేశంలో నమోదైన నగల వ్యాపారుల సంఖ్య సైతం మునుపటితో పోలిస్తే చాలా పెరగడానికి ఇదే కారణం. గతంలో రిజిస్టర్‌ అయిన నగల వ్యాపారుల సంఖ్య 34,647 ఉండగా.. ఇప్పుడు ఈ సంఖ్య 1,94,039కి పెరిగింది. హాల్‌మార్కింగ్ కేంద్రాల సంఖ్య కూడా 945 నుంచి 1,622కి పెరిగింది. మీరు కొనుగోలు చేసే ఆభరణాలపై హాల్‌మార్క్‌ ఉంటే.. అది నిజమైనా హాల్‌మార్కింగ్‌ అవునా? కదా? అనే అనుమానం ఉంటే.. బీఐఎస్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా గుర్తించేందుకు వీలుంది. ఈ యాప్‌ని సహాయంతో కస్టమర్ హాల్‌మార్క్ బంగారు ఆభరణాల ప్రామాణికతను ధ్రువీకరించుకోవచ్చు. ఫేక్‌ అని తేలితే బీఐఎస్‌ మార్క్‌ దుర్వినియోగంపై సైతం ఫిర్యాదులు చేయొచ్చు.

ANN TOP 10