AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మహారాష్ట్రలో మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి కంది ఎన్నికల ప్రచారం..

కాంగ్రెస్‌ అగ్ర నాయకులు మాణిక్‌రావు ఠాక్రేతో కలిసి ఆదిలాబాద్ నేత కంది శ్రీనివాస రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఠాక్రే పోటీ చేస్తున్న మహారాష్ట్రలోని దిగ్రాస్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కంది మాట్లాడుతూ మాణిక్ ఠాక్రే వంటి మంచి వ్యక్తిని, దిగ్గజ నేత‌ను గెలిపించుకుంటే ఎంతో అభివృద్ధి జ‌రుగుతుంద‌ని, దిగ్రస్‌, ధార్వ నియోజ‌క‌వ‌ర్గాలు ప్రగ‌తి ప‌థంలో ప‌య‌నిస్తాయ‌ని అన్నారు. త‌న ప్రసంగంతో స‌భికుల‌ను ఉత్తేజ ప‌రిచారు కంది శ్రీ‌నివాస‌రెడ్డి.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ‌లో అమ‌లు చేస్తున్న సంక్షేమ‌, అభివృద్ధి కార్యక్రమాల‌ను వివ‌రించారు. మ‌హారాష్ట్రలోనూ కాంగ్రెస్ కూట‌మిను గెలిపించి గ‌ద్దెనెక్కించాల‌ని పిలుపునిచ్చారు. ఇక్కడ జ‌రిగే ఎన్నిక‌లు చారిత్రాత్మక‌మ‌న్నారు. మాణిక్ ఠాక్రే లాంటి దిగ్గజ నేత‌ను ఎన్నుకుంటే ఎంవీఏ కూట‌మి ప్రభుత్వంలో ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి ద‌క్కే అవకాశం ఉంద‌ని , త‌ద్వారా ఈ ప్రాంత అభివృద్ధికి బాట‌లు ప‌డ‌తాయ‌ని అన్నారు. నూత‌న ర‌హ‌దారులు, డ్రైనేజీలు, పాఠ‌శాల‌ల నిర్మాణాలు జ‌రుగుతాయ‌న్నారు. ప‌ద‌వీపై కాంక్షతో ఆనాడు కాంగ్రెస్‌ను మోసం చేసినవారికి త‌గినరీతిలో బుద్ధిచెప్పాలంటే కాంగ్రెస్‌ను గెలిపించి తీరాల‌ని, త‌మ అభివృద్ధికి బాట‌లు వేసుకోవాల‌ని పిలుపునిచ్చారు.

 

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10