AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మణిపూర్‌లో తాజా హింసాకాండపై అమిత్‌షా సమీక్ష

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌ (Manipur)లో మళ్లీ హింసాత్మక పరిస్థితులు నెలకొనడంతో కేంద్ర అప్రమత్తమైంది. మైతేయ్ తెగకు చెందిన ఆరుగురిని మిలిటెంట్లు ఇటీవల ఊచకోత కోయడం, ఆగ్రహోదగ్రులైన ఆందోళనకారులు శనివారంనాడు పలువురు మణిపూర్ మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు, హింసాకాండకు దిగడంతో తాజా పరిస్థితిని కేంద్రం ఆదివారం  సమీక్షించింది.

హోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి రాష్ట్రంలో శాంతి స్థాపనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. సోమవారం నార్త్ బ్లాక్‌లో సమగ్ర సమీక్షను సైతం హోం మంత్రి నిర్వహించనున్నారు.

మణిపూర్‌లోని జిరిబాం జిల్లాలో మిలిటెంట్లు ఆరుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి హతమార్చడం, వారి మృతదేహాలు వెలుగుచూడంతో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దీంతో పెద్దఎత్తున ఇంఫాల్‌లో నిరసనలు పెల్లుబికాయి. ఆందోళనకారులు ముగ్గురు మంత్రులు, ఆరుగురు ఎమ్మెల్యేల ఇళ్లపై దాడికి దిగారు. పలు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో అధికారులు 8 జిల్లాలో కర్ఫ్యూ విధించారు. ఇంఫాల్‌ వెస్ట్, బిష్ణుపూర్, ఇంఫాల్ ఈస్ట్‌, తౌబల్స కాక్‌చింగ్, కాంగ్కోక్పి, చురాచాంద్‌పూర్‌లో రెండ్రోజుల పాటు ఇంటర్నెట్, మొబైల్ డాటా సర్వీసులను నిలిపివేశారు.

ANN TOP 10