AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కవిత ఇంటికి అధికారులు.. సమగ్ర సర్వే వివరాలు నమోదు

తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కులగణన ప్రక్రియను తలపెట్టింది. ఈ సర్వేలో భాగంగా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల తదితర వివరాలను సేకరిస్తున్నారు. కులగణనలో శనివారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత పాల్గొని వివరాలు నమోదు చేయించుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా కులగణన సర్వే చేపట్టింది. సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 1.17 కోట్లకు పైగా ఇళ్లను గుర్తించి మొదటి దశలో వాటికి స్టిక్కర్లు అంటించారు. రెండో దశలో ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నల ద్వారా ఎన్యుమరేటర్లు సమాచారం సేకరిస్తున్నారు. అయితే ఇందులో ఆర్థిక, సామాజిక, రాజకీయ, విద్య ఇలా అన్ని అంశాలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి.

పలురు ప్రముఖులు కూడా కులగణనలో వివరాలు నమోదు చేసుకుంటున్నారు. శనివారం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా కులగణనలో వివరాలను నమోదు చేయించుకున్నారు. కవిత నివాసం ఉంటున్న బంజారాహిల్స్‌లోని ఇంటికి కులగణన అధికారులు వచ్చారు. అధికారులకు సహకరించి కులగణనలో ఎమ్మెల్సీ కవిత వివరాలు నమోదు చేయించుకున్నారు.

ANN TOP 10