కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… కేసుల నుంచి బయటపడేందుకే కేటీఆర్ ఢిల్లీ వెళ్లారని అన్నారు. కేటీఆర్ ను ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారని ఎద్దేవా చేశారు. మంత్రిగా అధికారంలో ఉన్నప్పుడు మోడీలేడు – బోడీ లేడని చెప్పిన కేటీఆర్ కు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తొంచ్చిందా? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పట్ల కేటీఆర్ లో వచ్చిన మార్పు పెద్ద జోక్ అంటూ ఎద్దేవా చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రమంత్రులను కలవడానికి చేతగాని కేటీఆర్.. కేసుల మాఫీ కోసం కొత్త నాటకానికి తెరతీశాడని విమర్శించారు.
ఆర్ఆర్ఆర్ మంజూరీ అయి సంవత్సరాలు గడిచినా గడ్కరీని ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ఎందుకు పనులు ప్రారంభించాలని అడగలేదని అన్నారు. కేటీఆర్ ఢిల్లీ టూర్ పెద్ద డైవర్షన్ పాలిటిక్స్ అని విమర్శించారు. ఫార్మూల్ 1 రేస్ లో 50 కోట్ల రూపాయలు ఓరల్ ఇన్ స్ట్రక్షన్ తో ఇవ్వడంమీద ఏసీబీ కేసు బుక్ చేసేందుకు గవర్నర్ ప్రసిక్యూషన్ కు అనుమతించాడనే భయంతోనే ఢిల్లీకి వెళ్లాడన్నారు. కేటీఆర్ ఫెమా, ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి రూపాయలను.. డాలర్లుగా మార్చి కన్సల్టెన్సీల కడుపు నింపాడని కామెంట్ చేశారు. హైదరాబాద్ పేరు చెప్పి.. అడ్డంగా దోపిడికి తెరతీసిన దోపిడిరావు కేటీఆర్ అని మండిపడ్డారు.
కేటీఆర్ తెచ్చింది ఒరిజినల్ ఫార్మూలా-1 కాదు.. పెద్ద డూప్లీకేట్ అంటూ వ్యాఖ్యానించారు. అమృత్ -2.0 టెండర్లలో అవినీతి గురించి కేటీఆర్ మాట్లాడటం ఈ శతాబ్ధపు పెద్ద జోక్ అన్నారు. సుజన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డికి తోక చుట్టం.. కానీ కల్వకుంట్ల కవితకు దశబ్ధానికిపైగా బిజినెస్ పార్ట్ నర్ అని చెప్పారు. కవితా, సుజన్ రెడ్డి ఇద్దరూ బిజినెస్ పార్ట్ నర్స్ అని ఆరోపించారు. ఇరిగేషన్ టన్నెల్ పనులు చేసిందివారే.. దానికి కేటీఆర్ జవాబు చెప్పాలని అన్నారు. అమృత్ టెండర్లు తమ ప్రభుత్వం వచ్చే వరకే టెండర్ పూర్తయ్యే దశలో ఉన్నాయని చెప్పారు. తేజారాజుకు చెందిన గజా కన్ స్ట్రక్షన్ కు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందేవరు.. కేటీఆర్ కాదా ? అని ప్రశ్నించారు.
ప్రతిమా శ్రీనివాసరాజుకు అమృత్ -1 టెండర్లు ఇచ్చిందేవరు.. మెగా కంపెనీకి టెండర్లు ఇచ్చిందెవరూ కేసిఆర్ కాదా ? అని నిలదీశారు. 21 వేల కోట్ల విలువైన కాళేశ్వరం పనులను హాస్పిటల్ నిర్వహించే ప్రతిమ శ్రీనివాస్ రావు కు ఎట్లిచ్చిండ్రు ? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చేవరకు ఉద్యోగులకు 15 తారీఖు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదని, పెన్షనర్లకు 15 తారీఖు పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పారు. ఇన్ని ఇబ్బందుల్లో కూడా 22 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, కోట్లమంది అక్కా చెల్లెండ్లను ఉచితంగా బస్సుల్లో ప్రయాణించేలా చేశామన్నారు. రూ. 500 లకే గ్యాస్ సిలిండర్లు ఇచ్చామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇచ్చామన్నారు. తెలంగాణ ఆర్ధిక పరిస్థితి మేధావులకు తెలుసని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా సహకరించినందుకు.. తనను ఫార్మూల స్కాం నుంచి తప్పించమని అమిత్ షాను కలవడానికి కేటీఆర్ ఢిల్లికి వెళ్లారని అన్నారు.