AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కలెక్టర్‌పై దాడి ఘటనలో కేటీఆర్‌ హస్తం!..

– వికారాబాద్‌ ఘటనపై విస్తుపోయే నిజాలు వెలుగులోకి..
– నిందితుడు మాజీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు
– ఘటనకు ముందు నరేంద్‌రెడ్డితో 42 సార్లు ఫోన్‌ సంభాషణ
– 6 సార్లు కేటీఆర్‌తో మాట్లాడిన నరేందర్‌రెడ్డి
– కూపీలాగుతున్న పోలీసులు

వికారాబాద్‌ కలెక్టర్‌పై దాడి కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసుకు సంబంధించి పోలీసులు చేపట్టిన విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. దాడి చేసేందుకు కుట్ర చేసిన వ్యక్తిని సురేష్‌గా పోలీసులు కనిపెట్టారు. పట్నం నరేందర్‌ రెడ్డి ప్రధాన అనుచరుడిగా సురేష్‌ ఉన్నాడు.

దాడికి ముందు..
దాడి జరిగే కొన్ని గంటల ముందు పట్నం నరేందర్‌ రెడ్డితో 42 సార్లు సురేష్‌ మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. సురేష్‌ తో మాట్లాడుతూ 6 సార్లు కేటీఆర్‌తో ఫోన్లో పట్నం నరేందర్‌ రెడ్డి మాట్లాడినట్లు తెలుస్తోంది. సురేష్‌పై ఇప్పటికే రేప్‌ కేసుతో సహా పలు కేసులు ఉన్నాయి. చెల్లెలి వరస అయ్యే అమ్మాయిపై అత్యాచారానికి పాల్పడినందుకు అతడిపై రేప్‌ కేసు నమోదు అయ్యింది. సురేష్‌పై కేసులు తొలగించేలా పట్నం నరేందర్‌ రెడ్డి సహాయం చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

అభిప్రాయ సేకరణకు వచ్చిన కలెక్టర్‌పై..
కాగా.. వికారాబాద్‌ జిల్లా లగ్గిచర్లలో ఫార్మా విలేజ్‌పై అభిప్రాయ సేకరణ ఉద్రిక్తంగా మారిన విషయం తెలిసిందే. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన జిల్లా కలెక్టర్‌పై స్థానిక ప్రజలు దాడి చేయడం కలకలం రేపింది. అంతే కాదు కలెక్టర్, అధికారులకు సంబంధించిన మూడు కార్లను ప్రజలు ధ్వంసం చేశారు. ఈక్రమంలో గ్రామంలో తీవ్ర హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. జిల్లాలోని కొడంగల్‌ నియోజకవర్గంలోని లగ్గిచర్ల, పోలేపల్లి, హీకంపేట మూడు గ్రామాల్లో ఫార్మా విలేజ్‌ను ఏర్పాటు చేసేందుకు మూడు వేల ఎకరాల సేకరణ కోసం అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఊహించని ఘటన..
ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు భూములను స్వచ్చంధంగా ఇచ్చేశారు. అయితే లగ్గిచర్ల గ్రామంలో ముందుగా ప్రజాభిప్రాయసేకణ చేసేందుకు అధికారులు నిర్ణయించారు. గ్రామానికి రెండు కిలో మీటర్ల దూరంలో తాత్కాలిక సభను నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నించగా.. అందుకు గ్రామస్తులు నిరాకరించారు. దీంతో కలెక్టర్, రెవెన్యూ అధికారులు గ్రామంలోకి వచ్చి ప్రజలతో మాట్లాడేందుకు యత్నించారు. ఇంతలోనే ఊహించని ఘటన చోటు చేసుకుంది.

మొదట ఓ మహిళ చేయిచేసుకోవడంతో..
కలెక్టర్‌ మాట్లాడుతున్న సమయంలో ఓ మహిళ వెనుక నుంచి కలెక్టర్‌ భుజంపై చేయిచేసుకోవడంతో ఆయన ముందుకు తూలారు. ఇదే అదునుగా భావించిన అక్కడి ప్రజలు కలెక్టర్‌పై విరుచుకుపడ్డారు. గ్రామస్తులకు, అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. గ్రామస్తులు తమ ఆందోళనను తీవ్ర తరం చేశారు. అధికారులకు సంబంధించిన మూడు కార్లను ధ్వంసం చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జిల్లా కలెక్టర్‌ను గ్రామస్తుల బారి నుంచి రక్షించారు. అయితే కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10