AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

శ్రీశైలంలో భక్తుల సందడి.. శివ‌నామ స్మ‌ర‌ణ‌తో మార్మోగిన మ‌ల్ల‌న్న స‌న్నిధి..

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల మహా పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. కార్తీక మాసం రెండో సోమవారం పరమశివుని దర్శనానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండే కాక ఉత్తర దక్షిణాది రాష్ట్రాల నుండి వచ్చిన యాత్రికులు తెల్లవారుజాము నుండి క్యూలైన్లలో బారులు దీరారు. తెల్లవారుజుమున కృష్ణా నదిలో పుణ్య స్నానాలు చేసుకుని పసుపు కుంకుమలతో సారె సమర్పించి, కార్తీక దీప దానాలు చేశారు.

భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న కారణంగాశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టిందని అధికారులు తెలిపారు. స్వామి వారి గర్భాలయ అభిషేకాలను మాసాంతం తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా అమ్మవారికి కుంకుమార్చనలు, చండీహోమం, రుద్రయాగం, నిత్యకళ్యాణంలో భక్తులు పాల్గొన్నారు.  ఆలయ దర్శనాలు ప్రారంభమై ముగిసేంత వరకు ఉచిత ప్రసాద వితరణ, క్యూలైన్లలో దర్శనానికి వేచిఉండే భక్తులకు పాలు, మంచీనీరు, బిస్కెట్లు, అల్పాహారం అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ANN TOP 10