సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉదయం 10 గంటలకు ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. జస్టిస్ ఖన్నా 2025 మే 13 వరకు సీజేఐగా కొనసాగుతారు. ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు. ఆయన 2019 జనవరి 18 నుంచి సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు.
ఎన్నికల బాండ్లను రద్దు చేయడం, ఈవీఎంలు విశ్వసనీయమైనవని ప్రకటించడం, 370 అధికరణ రద్దును సమర్థించడం, ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం లాంటి కీలక తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో జస్టిస్ ఖన్నా భాగస్వామిగా ఉన్నారు.